పుష్కర ఘాట్ వద్ద మాక్ డ్రిల్
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:30 PM
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించుకునేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, డీడీఆర్‌ఎఫ్ బృందాలు గురువారం అలంపూర్ జోగుళాంబ ఆలయ ప్రాంగణంలోని పుష్కరఘాట్ వద్ద మాక్‌డ్రిల్ నిర్వహించారు.
అలంపూర్ అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించుకునేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, డీడీఆర్‌ఎఫ్ బృందాలు గురువారం అలంపూర్ జోగుళాంబ ఆలయ ప్రాంగణంలోని పుష్కరఘాట్ వద్ద మాక్‌డ్రిల్ నిర్వహించారు. పోలీస్‌శాఖ ఆదేశాల మేరకు అలంపూర్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో తుంగభద్ర నదిలో ప్రత్యేక బోట్ల సహాయం తో శిక్షణ ఇచ్చారు. ప్రజలు ప్రకృతి విపత్తులు ఎదురైన సమయాల్లో తమను తాము ప్రాణాలతో ఎలా కాపాడుకోవాలో చూపించారు. ఎన్‌డీ ఆర్‌ఎఫ్ బృందాల విన్యాసాలను పట్టణ ప్రజలు, విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్ర మంలో ఎన్డీఆర్‌ఎఫ్ చీఫ్ దేవేంద్రసింగ్ తహసీల్దార్ మంజుల, ఎంపీడీవో పద్మావతి, ఎంఈఓ తదితరులు ఉన్నారు.