Share News

జములమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:23 PM

జములమ్మ ఆల యంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

జములమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
జములమ్మ ఆలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకులు

గద్వాల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జములమ్మ ఆల యంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భం గా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈవో పురేందర్‌కుమార్‌, ఆలయ చైర్మన్‌ వెంకట్రాములు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 11:23 PM