నాట్లేసిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:37 PM
నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి వరి నాట్లు వేశారు. నారాయణపేట మండలం చిన్నజట్రం సమీపంలో కూలీలు నాట్లు వేస్తుండగా అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే వారి వద్దకు వెళ్లి పలుకరించారు.
నారాయణపేట, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి వరి నాట్లు వేశారు. నారాయణపేట మండలం చిన్నజట్రం సమీపంలో కూలీలు నాట్లు వేస్తుండగా అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే వారి వద్దకు వెళ్లి పలుకరించారు. తర్వాత కరిగెట్లోకి దిగి, కూలీలతో కలిసి నాట్లు వేశారు. కూలీలు ఎమ్మెల్యేకు ఇలా నాటు వేయాలని చూపించారు. తమతో కలిసి ఎమ్మెల్యే నాట్లు వేయడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.