రవాణా శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:20 PM
రా ష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ను వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి ప్రత్యేకంగా కలిశారు.
వనపర్తి టౌన్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : రా ష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ను వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి ప్రత్యేకంగా కలిశారు. సోమవా రం హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయం లో మంత్రిని కలిసిన వనపర్తి జిల్లా కేంద్రంలో రవాణా శాఖ (ఆర్‌టీవో) నూతన కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయా లని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వనపర్తి మం డలం అప్పాయపల్లి గ్రామ శివారులో రూ.9.50 కోట్లతో జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ని ర్మించేందుకు త్వరలోనే జీవో జారీ చేయను న్నట్లు మంత్రి పేర్కొన్నారని వివరించారు.