సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే స్థల పరిశీలన
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:39 PM
మండల కేంద్రంలోని అయ్యప్ప గుట్ట పరిసరాల్లోని ప్రభుత్వ భూమిలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
మూసాపేట, జూన్ 1 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని అయ్యప్ప గుట్ట పరిసరాల్లోని ప్రభుత్వ భూమిలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. 6న సబ్‌స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానుండటంతో స్థల పరిశీలనతో పాటు కావల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని భూత్పూర్ మండలంలో తాటిపర్తి, మదిగట్ల, అమిస్తాపూర్, అడ్డాకుల మండలంలో కందూరు, గుడిబండ, ముత్యాలంపల్లి, మూసాపేట మండలంలో మూసాపేటతో పాటు పోల్కంపల్లిలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు, మూసాపేటలో 33తో పాటు 132/11 కేవీ రెండు కేంద్రాలు మంజూరైనట్లు తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, మాజీ ఎంపీపీలు బగ్గి కృష్ణయ్య, నాగార్జున్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సూదిరెడ్డి లక్ష్మికాంత్‌రెడ్డి, నల్ల తిరుపతయ్యగౌడ్, లక్ష్మినారాయణ, రాంచందర్, గడ్డం మహేందర్, కృష్ణయ్య, శెట్టి శ్రావన్, ఉట్కూర్ ఖలీల్ పాల్గొన్నారు.