16న పిల్లలమర్రికి మిస్ వరల్డ్ పోటీదారులు
ABN , Publish Date - May 03 , 2025 | 11:09 PM
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహబూబ్‌నగర్‌లోని పిల్లల మర్రిని సందర్శించేందుకు ఈ నెల 16న 22 దేశాల సుందరీమణులు రానున్నారని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ తెలిపారు.
వారి రాక సందర్భంగా మూడంచెల భద్రత ఏర్పాటు
మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ
పిల్లల మర్రిని పరిశీలించిన అధికారులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహబూబ్‌నగర్‌లోని పిల్లల మర్రిని సందర్శించేందుకు ఈ నెల 16న 22 దేశాల సుందరీమణులు రానున్నారని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. పిల్లలమర్రి పర్యాటక క్షేత్రాన్ని శనివారం సాయంత్రం ఆయన డీఐజీ ఎల్ చౌహన్, జిల్లా ఎస్పీ డి జానకి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతా్‌పతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే 72వ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా 22 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ అందాల పోటీలలో పాల్గొనే సుందరీమణులు ఈ నెల 16న సాయంత్రం పిల్లలమర్రి మహావృక్షాన్ని సందర్శించున్నారని చెప్పారు. వారి రాక సందర్భంగా పోలీసు శాఖ మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వారి సందర్శనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుమారు వెయ్యిమంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షణ చేస్తారన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ గాంధీనాయక్, ట్రాఫిక్ సీఐ భగవంత్ రెడ్డి, ఇతర అధికారులు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.