Share News

‘హరికథ’ పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:56 PM

ఐరావత సినీ కల్చర్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిత మైన హరికథ సినిమా విడుదల తేదీ పోస్టర్‌ను మక్తల్‌ పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక, డెయిరీ క్రీడా యువజన, మత్స్య శాఖ మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి ఆవి ష్కరించారు.

 ‘హరికథ’ పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి

- నవంబరు 7న విడుదల కానున్న సినిమా

మక్తల్‌రూరల్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఐరావత సినీ కల్చర్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిత మైన హరికథ సినిమా విడుదల తేదీ పోస్టర్‌ను మక్తల్‌ పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక, డెయిరీ క్రీడా యువజన, మత్స్య శాఖ మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి ఆవి ష్కరించారు. నవంబరు 7న హరికథ సినిమా విడుదలవుతుందని ప్రకటించారు. మక్తల్‌ ప్రాంత వాసులతో రూపొందించబడి న హరికథ సినిమా భారీ స్థాయిలో సూపర్‌ హి ట్‌ అయి ఈ ప్రాంత వాసులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షిం చారు. దర్శకుడు అనుదీప్‌రెడ్డితో పాటు నిర్మాత లు రంజిత్‌గౌడ్‌, వివేకానంద, రాఘవేందర్‌, కవి త, అందరు ఈ ప్రాంత వాసులేనన్నారు. చాలా వరకు మక్తల్‌ నియోజకవర్గంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో అద్భుతమైన లోకెషన్‌లలో సినిమా చిత్రీకరించారన్నారు.పూర్తిగా కుటుంబ సభ్యులందరు కలిసి సిని మాను ఎంజాయ్‌ చేయవచ్చన్నారు. నవంబరు 7వ తేదీన విడుదలవుతున్న హరికథ సినిమాను ఈ ప్రాంత వాసులే. కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరు వీక్షించాలని కోరారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ హరికథ వినూత్నమైన సినిమా అని, అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ ప్రేమ కథా చిత్రమని తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా అందరికి నచ్చేలా తీశామని తెలిపారు. నిర్మా తలు మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ చా లా బాగుందని సినిమా చాలా బాగా వచ్చిందని నవంబర్‌ ఏడో తేదీన రిలీజ్‌ అవుతున్న సినిమా ను ప్రజలందరు ఆదరించాలని కోరారు. హరిక థ సినిమా నటులు కిరణ్‌, రంజిత్‌, సజ్జన్‌, అఖి ల్‌ రామ్‌, లావణ్య, కీర్తి, భాస్కర్‌, కృష్ణ, ఇతర సాంకేతిక నిపుణులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 11:56 PM