దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి
ABN , Publish Date - Oct 01 , 2025 | 10:52 PM
తెలంగాణ ప్రజలకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విజయ దశిమి(దసరా) పండగ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విజయ దశిమి(దసరా) పండగ శుభాకాంక్షలు తెలిపారు. విశేష భక్తిశ్రద్ధల తో శరన్నవరాత్రి పూజలు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వేడుకగా జరుపుకున్నారని అన్నారు. ఊరు, వాడలంతా అమ్మవారి సంబురా లతో భక్తి భావం ఉట్టిపడుతోందన్నారు. ప్రధానంగా ఈ ఏడాది బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయన్నారు. ప్రజా సంక్షే మం-రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా శ్రమిస్తున్న ప్రజాప్రభుత్వానికి ప్రజ ల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని కోరుకుంటు న్నానని ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.