Share News

రూ.1.80 కోట్లతో మినీ ఇండోర్‌ స్టేడియం

ABN , Publish Date - May 21 , 2025 | 11:19 PM

వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత మండలాల్లో ఇండోర్‌ స్టేడియం నిర్మాణాలకు కట్టుబడి ఉన్నానని రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి పేర్కొన్నారు.

రూ.1.80 కోట్లతో మినీ ఇండోర్‌ స్టేడియం
అమరచింతలో రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని సన్మానిస్తున్న నాయకులు

రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి

అమరచింత/ఆత్మకూరు, మే 21(ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత మండలాల్లో ఇండోర్‌ స్టేడియం నిర్మాణాలకు కట్టుబడి ఉన్నానని రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రాష్ట్ర కాంగ్రెస్‌ కల్లు విభాగం చైర్మన్‌ కేశం నాగరాజు గౌడ్‌తో కలిసి అమరచింత, ఆత్మకూరులలో పర్యటించి క్రీడా మైదానా లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరచింత హై స్కూల్‌ గ్రౌండ్‌లో ఇండోర్‌ స్టేడియం కోసం కోటి రుపాయలు, ఆత్మకూరు తేరు మైదానంలో మినీ ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి రూ.1.80 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మక్తల్‌ నియోజకవర్గంలో మక్తల్‌, అమరచింత, ఆత్మ కూరు క్రీడా మైదానాలపై ఎమ్మెల్యేకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తాన ని తెలిపారు. ఇక్కడ ప్రొ కబడ్డీ క్రీడాకారులు ఉన్నందున కబడ్డీ మ్యాట్‌ ఇచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే జిల్లాకు ఒక కబడ్డీ మ్యాట్‌ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు మ్యాట్‌లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అనంత రం మే డే ఉత్సవాలలో భాగంగా బస్టాండ్‌ సెంటర్‌లో కాంగ్రెస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఆత్మకూరు, అమరచింత నాయకులు, కార్యకర్తలు, కార్మిక విభా గం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 11:19 PM