అర్ధరాత్రి ఎస్పీ తనిఖీలు
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:57 PM
అర్దరాత్రి 12 గంటలకు పోలీస్ బాస్ రోడ్లపైకి వచ్చారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలు బస్టాండ్, రైల్వేస్టేషన్ సి బ్బందితో వెళ్లి అనుమానితుల కదలికను పరిశీలించారు.
- అనుమానితుల వేలిముద్రల సేకరణ
- అసాంఘిక చర్యలపై నిఘా
మహబూబ్‌నగర్, జూలై 27 (ఆంరఽధజ్యోతి): అర్దరాత్రి 12 గంటలకు పోలీస్ బాస్ రోడ్లపైకి వచ్చారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలు బస్టాండ్, రైల్వేస్టేషన్ సి బ్బందితో వెళ్లి అనుమానితుల కదలికను పరిశీలించారు. రాత్రివేళ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదేవిధంగా అక్రమ సరకు రవాణా జరుగుతోంది. వీటిని పరిశీలించేందుకు ఎస్పీ జానకి నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్ డివైస్‌తో రైల్వేస్టేషన్, బస్టాండ్‌లలో అనుమానాస్పదంగా ఉన్న వాళ్ల వేలిముద్రలు సేకరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణకు పోలీస్‌శాఖ కట్టుబడి ప ని చేస్తుందన్నారు. రాత్రి సమయాల్లో అసాంఘిక శక్తుల కదలికలు గమనించేం దుకు, వాటిని అరికట్టేందుకు పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చె ప్పారు. రాత్రి వేళ జనం రద్దీగా ఉండే బస్టాండ్, రైల్వేస్టేషన్ వంటి ప్రాంతాల్లో అ నుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల వేలిముద్రలు సేకరించడం వల్ల వారికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు. ఫింగర్‌ప్రింట్ డివైస్ ద్వారా వ్యక్తుల వేలిముద్రలతో వారి నేరచరితను గుర్తించడం జరుగుతుందని వెల్లడించా రు. ఇలాంటి తనిఖీలు మున్ముందు కూడా చేపడతామని పేర్కొన్నారు. పోలీసుల నిరంతర నిఘా చర్యల వల్లే జిల్లాలో నేరాల రేటు గణనీయంగా తగ్గిపోయిందని గుర్తు చేశారు. ప్రజలకు అసాంఘిక శక్తుల సమాచారం తెలిస్తే పోలీసులకు వెం టనే సమాచారం అందించాలని కోరారు. డయల్ 100కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, ఆర్‌ఐ రవి పాల్గొన్నారు.