Share News

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలన

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:18 PM

మరికల్‌ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలతో పాటు, కోస్గి మండలం నాచారం కేజీబీవీలో మధ్యాహ్న భోజనాన్ని ఆయా మండలాల తహసీల్దార్లు అనిల్‌కుమార్‌, శ్రీనివాసులు పరిశీలించారు.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలన
మరికల్‌ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో భోజనాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌

మరికల్‌/కోస్గి/ఊట్కూర్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మరికల్‌ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలతో పాటు, కోస్గి మండలం నాచారం కేజీబీవీలో మధ్యాహ్న భోజనాన్ని ఆయా మండలాల తహసీల్దార్లు అనిల్‌కుమార్‌, శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల తహసీల్దార్లు వంట నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మెనూ పాటించకపోతే చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మరికల్‌లో ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, నాచారంలో కేజీబీవీ ఇన్‌చార్జి ఎస్‌వో స్వాతి, ఆర్‌ఐ లింగారెడ్డి ఉన్నారు.

ఊట్కూర్‌ మండలం కొల్లూర్‌ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను ఎంపీవో లక్ష్మీనరసింహరాజు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం బియ్యం స్టాక్‌తో పాటు, పాఠశాల రికార్డులను పరిశీలించి, పలు సూచనలు చేశారు.

Updated Date - Mar 11 , 2025 | 11:18 PM