సమానత్వం, మానవతా సందేశాలను స్మరించాలి
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:44 PM
సత్యసాయి బాబా 100వ జన్మదినోత్సవం సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆది వారం శతజయంతి వేడుకలు నిర్వహించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం : ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, సేవాతత్వాన్ని ప్రపంచానికి పరిచయడం చేసిన శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదినోత్సవం సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆది వారం శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సత్యసా యిబాబా సేవామార్గం అందరికీ ఆదర్శం కావాలన్నారు. సమాజ భద్రత కోసం పనిచేసే పోలీస్ సిబ్బంది సేవలో నిస్వార్ధత, క్రమశిక్షణ, సహనం పాటించడంలో బాబా బోధనలు ఎంతో ఉప యుక్తంగా ఉంటాయన్నారు. సత్యసాయి బాబా అందించిన సందేశాలలో ప్రేమే నా రూపం, సేవే నా ధర్మం అన్న మాట లు ప్రతీ ఒక్కరి జీవితంలో అనుసరణీయమన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐలు విజయభాస్కర్, ట్రాఫిక్ వింగ్ నుంచి బాలచంద్రుడు, పోలీసు సిబ్బంది ఉన్నారు.