ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:31 PM
జిల్లా కేంద్రంలోని అగ్రహర్ పేట పురా తన బొప్పలమఠంలో ఆదివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు
నారాయణపేట, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని అగ్రహర్ పేట పురా తన బొప్పలమఠంలో ఆదివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్ర మంలో గుర్మిట్కల్ ఖాస మఠం పీఠాధిపతి గురు మృగ రాజేంద్ర మహాస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రవచనం చేశారు. యో గా గురువు సురేశ్‌కుమార్, రాజు లాహోటి రఘువీర్ యాదవ్, బాలప్ప, జిల్లా యోగ సమితి సభ్యులు మహిళలు పాల్గొన్నా రు. వారు మాట్లాడుతూ.. ధ్యానం ద్వారా మాన సిక శాంతి, ఆరోగ్యం పెంపొందించుకోవాలని స్వామి వారు ఉపదేశించారు. సభ్యులు యోగా భ్యాసాలు, సామూహిక ధ్యానం నిర్వహించారు.