Share News

ఉపాధ్యాయుడికి మెమో జారీ

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:03 PM

‘వరుస సెలవులు.. సమయానికి రారు’ ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు.

 ఉపాధ్యాయుడికి మెమో జారీ

- ‘వరుస సెలవులు... సమయానికి రారు’ కథనానికి స్పందించిన అధికారులు

ఊర్కొండ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘వరుస సెలవులు.. సమయానికి రారు’ ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఊర్కొం డ మండలంలోని బాల్యలోక్య తండా ప్రా థమిక పాఠశాల ఉపాధ్యాయుడు వరుస సె లవులు పెట్టడంతో పాటు సమయపాలన పాటించడం లేదని... పాఠశాలకు వచ్చిన గంట, రెండు గంటల పాటు ఉండి వెళుతు న్నాడని వార్త ప్రచరితమైంది. దీంతో మం డల ఇన్‌చార్జి విద్యాధికారి శంకర్‌నాయక్‌ స్పందించి కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు అ బ్దుల్‌ రహీంను విచారణ చేసి చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. దీంతో కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు మండలంలోని బాల్యలోక్య తండాను గురువారం పరిశీలిం చారు. పాఠశాల వి ద్యార్థులను, వారి త ల్లిదండ్రులను కలిసి ఉపాధ్యాయుడి విధి నిర్వహణలో విద్యా బోధన, సమయపా లనపై విచారణ చేపట్టారు. విచారణలో వె ల్లడించిన అంశాలను మండల ఇన్‌చార్జి వి ద్యాధికారి శంకర్‌నాయక్‌కు తెలియజేశారు. వారి ఆదేశాల మేరకు మెమో జారీ చేయ డంతో పాటు ఒక రోజు వేతనం కట్‌ చేసిన ట్లు కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌ రహీం తెలిపారు. తదుపరి విషయాలను జి ల్లా ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:03 PM