గురుకుల ఘటనపై మెమో జారీ
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:28 PM
గద్వాల మండలం వీరాపురం సమీపంలోని సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి థామస్‌పై ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటనపై జిల్లా అధికారులు తీవ్రంగా స్పందించారని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.
- కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గద్వాల మండలం వీరాపురం సమీపంలోని సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి థామస్‌పై ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటనపై జిల్లా అధికారులు తీవ్రంగా స్పందించారని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత శాఖాధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక ని వేదిక ఆధారంగా సంబంధిత ఉపాధ్యాయు డి నుంచి వివరణ కోరతూ మెమో జారీ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా సంబంధిత ఉపాధ్యాయడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.