31న మెగా జాబ్ మేళా
ABN , Publish Date - May 29 , 2025 | 11:11 PM
గ్రామీణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రెడాక్స్ లే బరేటరీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాల సహకారంతో ఈ నెల 31న ఉద్యోగ మే ళా నిర్వహించనున్నట్లు జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వినోద్ ఒక ప్రకటనలో తెలిపారు.
వనపర్తి విద్యా విభాగం, మే 29 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రెడాక్స్ లే బరేటరీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాల సహకారంతో ఈ నెల 31న ఉద్యోగ మే ళా నిర్వహించనున్నట్లు జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వినోద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, బీఎస్సీ కెమిస్ట్రీ, డిప్లోమా ఐ టీఐ (మెకానికల్, ఎలక్ర్టికల్) చదివిన విద్యా ర్థులు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. ఉచిత భోజన వసతి కల్పించి ఉచితంగా శిక్ష ణను అందించనున్నారు. శిక్షణ కాలం పూర్త యిన యువతకు డాక్టర్ రెడ్డీస్, అరబిందో, గ్రాన్యుల్స్ వంటి ప్రముఖ కంపెనీలో ఉద్యోగం కల్పించి నెలకు రూ.18 నుంచి రూ.30 వేల వ రకు జీతం అందించనున్నట్లు తెలిపారు. ఆ సక్తి కలిగిన నిరుద్యోగ యువత మే 31న ఉ దయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలలో జరిగే ముఖాము ఖికి హాజరు కావాలన్నారు.