Share News

వర్షాలు సమృద్ధిగా కురవాలి అంజన్నా..

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:19 PM

వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు.

వర్షాలు సమృద్ధిగా కురవాలి అంజన్నా..
ఎద్దుల బండిపై కలశం, ఫలహారం ఊరేగింపు

అయిజ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఎద్దుల బం డ్లపై కలశం, ఫలహారాలను ఊరేగింపుగా గ ద్వాల రహదారిలోని కట్ట కిందస్వామి ఆలయానికి తీసుకెళ్లారు. ముందుగా జ్యోతి ఊరేగింపు వెళ్లగా, వెనుక బాజాభజంత్రీలతో ఎద్దుల బం డ్లు సాగాయి. కట్ట కిందస్వామికి తుంగభద్ర, కృష్ణానది జలాలతో అభిషేకం, ఫలహారాలతో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసంలో మొదటి శనివారం ఈ కార్యక్రమం ర్వహించటం సాంప్రదాయంగా వస్తున్నదని రైతులు తెలిపారు.

Updated Date - Jul 26 , 2025 | 11:19 PM