Share News

హక్కులను సాధించుకున్న దినమే మేడే

ABN , Publish Date - May 01 , 2025 | 11:26 PM

అమెరికా దేశంలోని చికాగో లో 1986 మే 3న రోజుకు ఎనిమిది గంటలు పనిదినాల కోసం కార్మికులు హక్కులను పోరాడి సాధించుకున్న దినమే మేడే అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌ అన్నారు.

హక్కులను సాధించుకున్న దినమే మేడే
కృష్ణ మండలం టైరోడ్డు వద్ద మాట్లాడుతున్న టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు బుట్టో

- మేడే స్ఫూర్తితో ఎనిమిది గంటల పని దినాన్ని కాపాడుకుందాం

- కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్‌ కోడ్‌లను వ్యతిరేకిద్దాం

- సీఐటీయూ జెండావిష్కరణలో జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌

నారాయణపేట/ఊట్కూర్‌/మాగనూరు/ కోస్గి/కోస్గిరూరల్‌/మరికల్‌/దామరగిద్ద/కొత్తపల్లి/మద్దూర్‌/కృష్ణ/మక్తల్‌/మక్తల్‌ రూరల్‌/ధన్వాడ, మే 1 (ఆంధ్రజ్యోతి): అమెరికా దేశంలోని చికాగో లో 1986 మే 3న రోజుకు ఎనిమిది గంటలు పనిదినాల కోసం కార్మికులు హక్కులను పోరాడి సాధించుకున్న దినమే మేడే అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌ అన్నారు. గురువారం నారాయణపేట మునిసిపల్‌ కార్యాలయం వద్ద మేడే సందర్భంగా ఆయన సీఐటీయూ జెండావి ష్కరణ చేశారు. అనంతరం కార్మికులనుద్ధేశించి ఆయన మాట్లాడారు. మన దేశంలో స్వాతం త్య్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను దేశ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం సవరించి నాలు గు కార్మిక కోడ్‌లను అమల్లోకి తీసుకొచ్చారని దీనివల్ల కార్మికులు మరోసారి బానిసత్వంలోకి నెట్టబడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికు లకు నష్టం కలిగించే నాలుగు లేబర్‌ కోడ్‌లను వ్యతిరేకిద్దామన్నారు. మేడే స్ఫూర్తితో ఎనిమిది గంటల పనిదినాన్ని కాపాడుకుందామన్నారు. అనంతరం పురవీధుల గుండా కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు సౌభాగ్య, సాయిలు, అరుణ, రాంలింగమ్మ తదితరులున్నారు. జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరుపుకు న్నారు.

అదేవిధంగా, ఊట్కూర్‌లో మాస్‌లైన్‌ పార్టీ, టీయూసీఐ, సీఐటీయూ, భవన నిర్మాణ, గ్రామ పంచాయతీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామగ్రామాన కార్మికులు ఎర్రజెండాను ఆవిష్కరించి, జేజేలు పలికారు. బిజ్వార్‌లో మాస్‌లైన్‌ పార్టీ గ్రామ కార్యదర్శి సిద్దు, ఊట్కూర్‌, అవుసులోన్‌ పల్లి గ్రామాల్లో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు చెన్నప్ప, పెద్దపొర్ల గ్రామంలో టీయూసీఐ నాయకుడు చిన్నబాలు, వల్లంపల్లిలో హన్మంతు, పగిడిమారిలో భీంరావు, అమీన్‌పూర్‌లో పెద్ద శంకరప్ప, పెద్దజట్రం గ్రామంలో నాగప్ప, కొత్తపల్లి గ్రామంలో రామాంజనేయులు జెండాను ఆవ్కిరించారు. ఈ సందర్భంగా కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తామని కార్మికుల చేత ప్రతిజ్ఞ చేయించారు.

మాగనూరులో సీఐటీయూ జెండాను నాయకులు ఆవిష్కరించి, మాట్లాడారు. పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షుడు అశోక్‌, కార్మికులు హనుమంతు, ఆరిఫ్‌, ఖాసీం ఉన్నారు.

కోస్గిలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో మునిసిపల్‌ కార్మికులు మేడే సందర్భంగా జెండాను ఎగురవేశారు. కార్మికులు నారాయణ, కనకప్ప, రాములు, కృష్ణ తదితరులున్నారు.

గుండుమాల్‌ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో ప్రజా ఉద్యమ నాయకుడు కృష్ణమౌర్య ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు కార్మిక జెండాను ఎగురవేసి మేడే దినోత్సవ ప్రత్యేకతను చాటి చెప్పారు. కా ర్యక్రమంలో నర్సిములు, జంగయ్య, కృష్ణ, శివకుమార్‌, రాములు, కృష్ణయ్య, సాయప్ప తదిత రులున్నారు.

మరికల్‌లో భవన, హమాలీ కార్మికులు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్‌ ఆధ్వర్యంలో, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు సీఐటీయూ జిల్లా నాయకుడు నరహరి ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు మేడే జెండాను ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సూరిటి గోపి, కుర్మన్న, హమాలీ కార్మికులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

దామరగిద్దలో సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ పార్టీ జిల్లా నాయకుడు పెద్దింటి రామకృష్ణ పార్టీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి జెండావిష్కరణ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నాయకురాలు అంజిలమ్మ జెండా ఆవిష్కరణ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్‌ మాట్లాడారు. సీఐటీయూ మండల కార్యదర్శి జోషి, అంగన్‌వాడీ టీచర్లు అనురాధ, ఈశ్వరమ్మ, నాగమ్మ, కార్మికులు పాల్గొన్నారు.

కొత్తపల్లి మండలం భూనీడు చౌరస్తాలో టీయూసీఐ నాయకులు కార్మిక జెండాను ఎగురవే శారు. జిల్లా కార్యదర్శి నర్సింహ, కొండప్ప, మ హిపాల్‌, హన్మంతు, గోవర్దన్‌, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మద్దూర్‌లోని పెదిరిపాడ్‌ చౌరస్తాలో సీఐటీయూ జెండాను జిల్లా నాయకురాలు శశికళ ఆవిష్కరించారు. జిల్లా నాయకుడు మహ్మద్‌అలీ, కమిటీ సభ్యుడు అశోక్‌ హాజరై, మాట్లాడారు. కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

కృష్ణ మండలం గుడెబల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని టైరోడ్డు వద్ద టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఏజీ.బుట్టో గురువారం జెండావిష్కరణ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మిక సంఘం, మెకానిక్‌ సంఘం, భగీరథ కార్మికులు పాల్గొన్నారు.

మక్తల్‌ మునిసిపల్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించి, మేడే జెండాను ఆవిష్కరించారు. సీఐ టీయూ జిల్లా కార్యదర్శి గోవిందరాజు, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌ మాట్లాడారు. మునిసిపల్‌ కార్యాలయంలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాలం ఆధ్వర్యంలో 70 మంది కార్మికులను సన్మానించారు. మునిసిపల్‌, అంగన్‌ వాడీ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

మక్తల్‌ మండలం చిట్యాల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులను గ్రామ యువకులు, పెద్దలు సన్మానించారు. కాంగ్రెస్‌ నాయకుడు అశోక్‌, గ్రామ యువకులు ఆంజనేయులు, మెకానిక్‌ బాబు, మెకానిక్‌ వెంకటేష్‌, అంజి, రాము, గణేష్‌, కథలప్ప, పెద్దలు పాల్గొన్నారు.

ధన్వాడలో గురువారం కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక రహదారిపై కార్మిక జెండాను ఎగురవేశారు. అంతకుముందు గ్రామంలో కార్మి కులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకుడు వెంకటేష్‌, పంచాయతీ సిబ్బంది బాలకృష్ణ, భాను, ఇమ్రాన్‌, రమేష్‌ తదితరులున్నారు.

Updated Date - May 01 , 2025 | 11:26 PM