మౌలానా అబుల్ కలాం సేవలు మరువలేనివి
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:40 PM
మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
- కలాం చిత్రపటానికి నివాళి అర్పించిన కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే
గద్వాల న్యూటౌన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన 137వ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా ది నోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో కలెక్టరేట్‌లోఆయన చిత్రపటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్బం గా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య లేకుం డా దేశం అభివృద్ధి చెందదని, విద్య స్వాతంత్ర్యానికి రెండో రూపంగా పేర్కొన్నారని అన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, మైనారిటీ అధికారి నుషిత, అధికారులు ఉన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..
గద్వాల టౌన్: భారత తొలి విద్యాశాఖ మం త్రిగా మౌలానా అబుల్ కలాం చేసిన సేవలు చి రస్మరణీయమని ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలంద ర్‌బాషా అన్నారు. దివంగత మౌలానా జయం తిని మంగళవారం పట్టణంలోని మహారాణి ఆది లక్ష్మీదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనం గా నిర్వహించారు. ఈసందర్భంగా జాతీయ వి ద్యా దినోత్సవం పేరుతో విద్యార్థులకు వ్యాసరచ న, వక్తృత్వ, క్విజ్, ఫుడ్ ఫెస్టివల్ వంటి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశా రు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చం ద్రమోహన్, అధ్యాపకులు ఉన్నారు.
స్మృతివనంలో..
గద్వాల పట్టణంలోని స్మృతివనంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యావంతులతో కలిసి దివంగత నేత జ్ఞాపకార్థం మొక్కలు నాటారు. కార్యక్రమం లో న్యాయవాది యుగంధర్, రెహ్మతుల్లా, మా లిం జమీర్ ఉన్నారు. రాజీవ్‌మార్గ్‌లోని అబుల్ కలాం విగ్రహానికి టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు శంకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇసాక్, మాజీ కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్, లక్ష్మన్, కౌసర్‌బేగ్ పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. బీఆర్‌ఎస్వీ, ఆవాజ్ కమిటీ నాయకు లు స్థానిక మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో దివంగత నేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాగర్‌దొడ్డి వెంకట్రాములు, అతిక్‌ఉర్ రెహమాన్, పల్లయ్య, రెహ్మతుల్లా, ఆటో చాంద్‌పాషా, సమీఉల్లా, షరీఫ్, ఖలీల్ ఉన్నారు.