Share News

వందేమాతరం సామూహిక గీతాలాపన

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:10 PM

వందేమాతరం జాతీయ గీతాన్ని మహాకవి బంకిమ్‌ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)లో గీతాన్ని సామూహికంగా ఆలపించారు.

వందేమాతరం సామూహిక గీతాలాపన
వందేమాతరం గీతాలాపనలో పాల్గొన్న కలెక్టర్‌ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్‌ శివేంద్ర పతాప్‌ తదితరులు

జాతీయ గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా..

పాల్గొన్న అన్ని శాఖల అధికారులు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వందేమాతరం జాతీయ గీతాన్ని మహాకవి బంకిమ్‌ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)లో గీతాన్ని సామూహికంగా ఆలపించారు. కలెక్టర్‌ విజయేందిర బోయి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటారు. వందేమాతరం గేయం దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యంం కలిగి ఉందని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, కలెక్టరేట్‌ ఏవో సువర్ణరాజ్‌, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:10 PM