Share News

సామూహిక వివాహాలు పేదలకు వరం

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:34 PM

సామూహిక వివాహాలు పేదలకు వరం అని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

సామూహిక వివాహాలు పేదలకు వరం
వధూవరులను ఆశీర్వదిస్తున్న ఎమ్మెల్యే దంపతులు

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

- అచ్చంపేటలో ఒకే మండపంలో ఒక్కటైన 61జంటలు

- కనుల పండువగా భారీ ఏర్పాట్లు

అచ్చంపేట/టౌన్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సామూహిక వివాహాలు పేదలకు వరం అని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. నాగర్‌ క ర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలో మునిసిపల్‌ కౌన్సిలర్‌ అప్పశివ 61 జంట లకు వివాహం జరిపించారు. ఈ సామూహిక వివాహ కార్యక్రమానికి ఎమ్మె ల్యే దంపతులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పశివ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిరుపేదలకు తన సొంత ఖర్చుతో వివాహాలు జరిపించడం శుభపరిణామమని అన్నారు. ఒకే వేదికపై 61జంటలు ఏకమవడం సంతోషమని, నూతన జంటలు ఆదర్శ ప్రాయంగా జీవిస్తూ నవ సమాజానికి నాంది పలకాలని ఆకాంక్షించారు. అదే విధంగా మనమందరం సామూహిక వివాహాలను ప్రోత్సహించాల్సిన అవస రం ఉందన్నారు. నేడు పేదలు తమ పిల్లలకు పెళ్లి చేయాలంటే అప్పులు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. పేదలు పేదలుగా ఉండకూడదని వారు కూ డా శ్రీమంతులుగా ఎదగాలన్నారు. అనంతరం వధూవరులతో పాటు ఎమ్మెల్యే దంపతులు గుర్రం బండిపై పట్టణంలో ఉరేగింపు నిర్వహించారు. కార్యక్ర మంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేందర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ శ్రీని వాసులు, ఉమామహేశ్వర దేవస్థాన చైర్మన్‌ మాధవరెడ్డి, వ్యవసాయ మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ రజిత మల్లేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Updated Date - Nov 16 , 2025 | 11:34 PM