భక్తిశ్రద్ధలతో సామూహిక వ్రతం
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:52 PM
కార్తీక మాసం ద్వాదశిని పురస్కరించుకుని ఆదివారం వడ్డేపల్లి మునిసిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ లోని ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.
వడ్డేపల్లి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం ద్వాదశిని పురస్కరించుకుని ఆదివారం వడ్డేపల్లి మునిసిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ లోని ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ సందర్బంగా అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజల అనంత రం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన స్వా మి వారి మండపంలో సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, వివిధ రకాల పూలు, తోరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేశారు. అనంతరం దంపతులు, భక్తులకు తీర్థప్రసాదాల అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు.