భవనంపై నుంచి కింద పడి తాపీ మేస్త్రీ దుర్మరణం
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:45 PM
ఇంటి నిర్మాణంలో ప్రమాదవశాత్తు భవ నంపై నుంచి కింద పడిన సంఘటనలో తాపీమేస్ర్తీ దుర్మరణం చెందిన ఘటన సో మవారం పెంట్లవెల్లిలో చోటు చేసుకుంది.
పెంట్లవెల్లి డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఇంటి నిర్మాణంలో ప్రమాదవశాత్తు భవ నంపై నుంచి కింద పడిన సంఘటనలో తాపీమేస్ర్తీ దుర్మరణం చెందిన ఘటన సో మవారం పెంట్లవెల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకా రం... నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మం డల కేంద్రానికి చెందిన తాపిమేస్ర్తీ బత్తిని వెంకటేష్ (46)ఇదే గ్రామంలోనే నూతన భ వనం నిర్మాణంలో భాగంగా సెంట్రింగ్ తొలగిస్తుండగా ప్రమాదవ శాత్తు మొదటి అంతస్తు నుంచి కాలుజారి కింద పడ్డాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో చికిత్స నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్ ఐ తెలిపారు. మృతుడి భార్య సూరమ్మ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.