Share News

ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

ABN , Publish Date - May 08 , 2025 | 11:23 PM

ఐదు రోజులలో తన వివాహం జరుగుతుందని, సంతోషంగా గడపాలని కలలు కన్న యువకుడు రో డ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.

ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం
రామనాయుడు, ఏఆర్‌ కానిస్టేబుల్‌ (ఫైల్‌)

- రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి

అయిజ, మే 8 (ఆంధ్రజ్యోతి): ఐదు రోజులలో తన వివాహం జరుగుతుందని, సంతోషంగా గడపాలని కలలు కన్న యువకుడు రో డ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వడ్డెపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన బుచ్చన్న చిన్న కుమారుడు రామనాయుడు (26) హైదరాబాద్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విఽధులు నిర్వహిస్తున్నా డు. ఈ నెల 14వ తేదీన తన వివాహం జరగాల్సి ఉంది. ఆక్రమంలో తన విధులకు సెలవు పెట్టి, పత్రికలు పంపిణీ చేసి బుధవారం రాత్రి వెంకటాపూర్‌ మీదుగా తన గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. తనగల గ్రామం నుంచి వెంకటాపురం గ్రామం వైపునకు త్రివేణ్‌ అనే యువకుడితో పాటు మరో ఇద్దరు మూడు బైక్‌లపై వచ్చారు. తన స్వగ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో, కిష్టాపూర్‌ స మీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురు గా ఢీకొన్నాయి. ఈ ఘటనలో త్రివేణ్‌ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. రామనాయుడికి తీవ్ర గాయాలు కావడంతో చికి త్స నిమిత్తం రాత్రి కర్నూ ల్‌ ఆస్పత్రికి తరలించారు. గురువారం పరిస్థితి విషమంగా మారటంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Updated Date - May 08 , 2025 | 11:23 PM