Share News

గంజాయి విక్రేతల అరెస్టు

ABN , Publish Date - May 15 , 2025 | 10:55 PM

గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గంజాయి విక్రేతల అరెస్టు
గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన నిందితులతో ఎక్సైజ్‌ పోలీసులు

- పరారీలో మరొకరు

- 350 గ్రాములు స్వాధీనం

మహబూబ్‌నగర్‌, మే 15 (ఆంధ్రజ్యోతి) : గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసు కున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. సంఘటనకు సంబంధించి ఎక్సైజ్‌ సీఐ వీరా రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎక్సైజ్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం ఆదేశం మేరకు జిల్లా అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించా రు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని బోయపల్లి గేట్‌ సమీపంలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు వారికి పక్కా సమాచారం అందింది. దీంతో గురువారం ఆ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. షాషాబ్‌ గుట్టకు చెందిన ఎండీ సల్మాన్‌, కోడి నరేశ్‌, పాషా అనే వ్యక్తులు ద్విచక్రవాహనంపై తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 60 గ్రాముల గంజాయి లభించింది. కొత్తగం జికి చెందిన దమ్మాయిపల్లి కిశోర్‌కుమార్‌ అనే వ్యక్తికి గంజాయి అమ్మేందుకు అక్కడికి వచ్చి నట్లు వారు అంగీకరించారు. గంజాయిని హన్వాడ మండలం వేపూర్‌ తండాకు చెందిన కాడావత్‌ రాహుల్‌ నుంచి తెచ్చినట్లు తెలి పారు. దీంతో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్ళి రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నది. అతని వద్ద 290 గ్రాముల గంజాయి లభించింది. నలుగురినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. దమ్మాయిపల్లి కిశోర్‌ పరారీలో ఉన్నా డు. నిందితుల నుంచి ఓ ద్విచక్ర వాహనం, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - May 15 , 2025 | 10:55 PM