Share News

గంజాయి ముఠా అరెస్టు

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:28 PM

గంజాయి ముఠాను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం రాత్రి పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

గంజాయి ముఠా అరెస్టు
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసులు

తెలకపల్లి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): గంజాయి ముఠాను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం రాత్రి పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం మఽధ్యా హ్నం తెలకపల్లి గ్రామ సమీపంలోని విజయుడు వెంచర్‌ పక్కన అ నుమానాదస్పదంగా ఉన్న ఐదుగురు యువకులను పక్కా సమాచా రంతో పోలీసులు పట్టుకొని విచారించారు. తెలిపారు. వారి దగ్గర నుంచి 138 గ్రాముల గంజాయి, మూడు సెల్‌ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు తెలిపారు. నాగర్‌ కర్నూల్‌కు చెందిన రేణు కుమార్‌, నాగర్‌ కర్నూల్‌కు చెందిన గణేష్‌, తెలకపల్లికి చెందిన అఖిల్‌, వట్టిపల్లికి చెందిన నారాయణ, చరణ్‌ మరో బాలుడు గంజాయి సేవిస్తూ పట్టుబడినట్లు డీఎస్పీ తెలిపారు. వారిని నాగర్‌ కర్నూల్‌ కోర్టులో హాజరు పరిచి వారిని రిమాండ్‌కు తర లిస్తున్నట్లు తెలిపారు. విలేకరులు సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్‌ రెడ్డి, ఎస్‌ఐ నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:28 PM