రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:14 PM
పండుగకు కూతురుని పుట్టింటికి తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తి రైలు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
రాజోలి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : పండుగకు కూతురుని పుట్టింటికి తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తి రైలు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని ఉందానగర్ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజోలికి చెందిన కుర్వ మల్లయ్య (55) అనే వ్యక్తి వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పండుగ సందర్భంగా హైదరాబాద్ శివారులోని బుద్వేల్‌లో నివాసం ఉంటున్న కూతురుని పండుగకు తీసుకువచ్చేందుకు శుక్రవారం మధ్యాహ్నం రాజోలి నుంచి బయలుదేరాడు. సాయంత్రం 7గంటలకు ఉందానగర్ సమీపంలో రైలు దిగే క్రమంలో అదుపు తప్పి కింద పడి అక్కడికక్కడే మృతి చెం దాడు. రైల్వే శాఖ అధికారులు ప్రమాద సంఘటనను పరిశీలించి కుటంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సంఘటన విన్న మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.