Share News

అదుపు తప్పిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:13 PM

రోడ్డు మలుపులో ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండ లంలో శనివారం చోటు చేసుకుంది.

అదుపు తప్పిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి

కొత్తకోట, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రోడ్డు మలుపులో ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండ లంలో శనివారం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రామకృష్ణాపూర్‌ గ్రామానికి చెందిన గట్టన్న (52) పెబ్బేర్‌ నుంచి సొంత గ్రా మానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నాటవెళ్లి గ్రామ సమీపంలో ఉన్న రో డ్డు మలుపులో వాహనం రోడ్డు కిందకు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన గట్టన్నను రోడ్డు వెంట వెళ్తున్న వాహనదారులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అప్పటికే మృతి చెంది ఉండడంతో పోలీసులకు సమా చాం ఇచారు. కుటుంబ సభ్యుల ఫిరాదు మేరకు కేసు నమోదు చేసుకొని పో స్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 11:13 PM