Share News

చేపల వేటకు వెళ్లి నీటిమడుగులో పడి వ్యక్తి మృతి

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:33 PM

ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి నీ టి మడుగులో పడి మృతి చెందిన సంఘటన దేదినేనిపల్లి గ్రామంలో శ నివారం జరిగింది.

చేపల వేటకు వెళ్లి నీటిమడుగులో పడి వ్యక్తి మృతి

పెద్దకొత్తపల్లి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి నీ టి మడుగులో పడి మృతి చెందిన సంఘటన దేదినేనిపల్లి గ్రామంలో శ నివారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేదినేనిప ల్లి గ్రామానికి చెందిన బోయ మీనుగ లక్ష్మయ్య (52) అనే వ్యక్తి గ్రామ స మీపంలోని ఉప్పలబావికుంట మడుగులో చేపల కోసం శుక్రవారం మ ధ్యాహ్నం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి ఊపిరాడక చనిపోయాడు. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగి రాకపోవడంతో శనివారం వెతక గా ఉప్పల బావిమడుగు దగ్గర మృతుని బట్టలు ఉండటంతో మడుగు నీ టిలో ఉన్న మీనుగ లక్ష్మయ్య మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సంఘటన పై మృతుని కుమారుడు మీను అశోక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతు న్నట్లు ఎస్‌ఐ వి.సతీష్‌ తెలిపారు. మృతునికి భార్య అలివేల, ఇద్దరు కు మారులు ఉన్నారు.

ఈత రాక..

కోస్గి రూరల్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): చేపల వేటకు వెళ్లి ఈత రాక వ్యక్తి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా కోస్గి మండల పరిఽ దిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకొంది. శనివారం స్థానిక ఎస్సై బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం... పల్నాడు జిల్లా కురుమల్ల పూడి గ్రామానికి చెందిన ద్యవర్ల రాజశేఖర్‌(32) కోస్గి మండలం కొత్తపల్లి గ్రామంలో చెరువు దగ్గర తూము పనుల కోసం గత రెండు నెలలుగా గ్రా మంలో ఉంటున్నాడు. ఈ నెల 13న సాయంత్రం కొత్తపల్లి చెరువులో చే పలు పట్టడానికి చెరువులోకి వెళ్లగా ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు తట్టుకొని బురదలో ఇరుక్కుపోయి ఈత రాక చనిపోయాడు. మృతుని భార్య ద్యవర్ల స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jun 14 , 2025 | 11:33 PM