ప్రమాదవశాత్తు సంప్‌లో పడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:35 PM
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని కొనగట్టుపల్లి గ్రామానికి గడ్డం రఘు(35) ప్రమాదవశాత్తు సంప్‌లో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.
హన్వాడ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని కొనగట్టుపల్లి గ్రామానికి గడ్డం రఘు(35) ప్రమాదవశాత్తు సంప్‌లో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. మూడు రోజుల క్రి తం రఘు అయ్యప్ప మాల ధరించి సల్లోనిపల్లి శివారులోని దేవాలయంలో ఉంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి సంప్‌లో పడ్డాడు. అటుగా ఉన్న వారు గమనించి అతన్ని సంప్ నుంచి తీసే లోపే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఈత రాకపో వడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం భార్య కీర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటు ఎస్‌ఐ తెలిపారు.