ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - May 29 , 2025 | 11:18 PM
జిల్లా కేంద్రంలోని గోనుపాడు శివారు లో ఉన్న ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఇంటిలో పట్టణానికి చెందిన డ్రైవర్ వడ్డె శ్రీనివాసులు (45) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.
- కలకలం రేపిన సూసైడ్ నోట్
గద్వాల, మే 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని గోనుపాడు శివారు లో ఉన్న ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఇంటిలో పట్టణానికి చెందిన డ్రైవర్ వడ్డె శ్రీనివాసులు (45) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పదేళ్లు గడుస్తున్నా ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో ఆత్మహత్య ఘటన చోటు చేసుకోవడం స్థానికులను కలవరానికి గురిచేసింది. తెరిచి ఉన్న ఇంట్లో సీలింగ్ కొక్కేనికి చీరతో ఉరివేసుకున్న వ్యక్తి కనిపించడంతో స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చనిపోయిన వ్యక్తిని డ్రైవర్‌గా గుర్తించి పోస్టుమా ర్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయిజకు చెందిన శ్రీనివాసులు కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం గద్వాలకు వచ్చి స్థానిక పాత హౌసిం గ్‌బోర్డు కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మతిస్థితిమితం లేని తన తల్లి రెండు రోజుల క్రితం గోనుపాడులో తిరుగుతున్నట్లు తెలు సుకున్న ఆయన బుధవారం రాత్రి అక్కడి వెళ్లినట్లు పోలీసులకు తెలి సింది. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.
ఓ మహిళే కారణమని సూసైడ్ నోట్
శ్రీనివాసులు జేబులో సూసైడ్ నోట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ‘తన చావుకు కారణం పట్టణంలోని ఒక మహిళ అంటూ’.. లేఖలో రాసిన ట్లు గుర్తించారు. కొంతకాలంగా ఆమెతో పరిచయం పెంచుకుని చనువు గా ఉంటున్న శ్రీనివాసులు ఇటీవల ఆమె మరికొంత మందితో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోకపోతున్నట్లు లేఖలో ఉంది. ఆమెపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు తెలిసింది. మృతుడి కుటుం బ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన అనంతరం మరింత దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని రూరల్ ఎస్‌ఐ తెలిపారు.