Share News

చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:21 PM

ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్‌ తెలిపారు.

చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
స్వాధీనం చేసుకున్న డబ్బు , నగదుతో పాటు పోలీసుల అదుపులో నిందితుడు

- రూ.11.43లక్షలు, 30 గ్రాముల బంగారు స్వాధీనం

- వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్‌

వనపర్తి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్‌ తెలిపారు. కేసు వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాన్‌గల్‌ మండలంలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మీనుగ రమేశ్‌ కొన్ని నెలలుగా వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. నెల రోజుల క్రితం వనపర్తి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో చొరబడి 12 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్‌ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి విచారణ చేపట్టారు. అందులో భాగంగా గురువారం తెల్లవారుజామున 5:30 సమయంలో జిల్లా కేంద్రం సమీపంలోని మర్రికుంటలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై వస్తున్న రమేశ్‌ పోలీసులను చూసి తడబడ్డాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొన్నారు. ద్విచక్రవాహనంలోని బ్యాగులో సోదా చేయగా కొంత నగదు, స్ర్కూ డ్రైవర్‌, బ్లేడు కనిపించాయి. దీంతో అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా, నాలుగు చోరీలకు పాల్పడ్డట్లు అంగీకరించాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా, బిజినేపల్లిలోని ఓ ఇంట్లో రూ. 11.43 లక్షలు చోరీ చేశాడు. వనపర్తి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 2 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఓ ఇంట్లో 12 గ్రాముల బంగారం, కొత్తకోట పట్టణంలోని ఓ ఇంట్లో 18 గ్రాముల బంగారం చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి, కోర్టు ఆదేశం మేరకు రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కృష్ణయ్య, రూరల్‌ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి, ప్రొబేషనరీ ఎస్‌ఐ వేణుకుమార్‌లను ఎస్పీ అభినందించి, రివార్డులు అందించాడ

Updated Date - Aug 21 , 2025 | 11:21 PM