సదస్సును విజయవంతం చేయాలి
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:02 PM
స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ అజాద్ జయంతి పురస్క రించుకొని హైదరాబాద్‌లో ఈ నెల 23న నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని ఆల్‌మేవా రాష్ట్ర అఽధ్యక్షుడు షేక్‌ఫారుక్‌హుస్సేన్ పిలుపునిచ్చారు.
- ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ఫారుక్ హుస్సేన్
మహబూబ్‌నగర్ అర్బన్, నవం బరు 21 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ అజాద్ జయంతి పురస్క రించుకొని హైదరాబాద్‌లో ఈ నెల 23న నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని ఆల్‌మేవా రాష్ట్ర అఽధ్యక్షుడు షేక్‌ఫారుక్‌హుస్సేన్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అం దించిన ఉద్యోగులు, పాత్రికేయులకు ఉత్తమ సేవా పురస్కారాలు అందజేయనున్నట్లు తెలి పారు. సమావేశంలో వహిద్‌షా, ఖాజనిజాము ద్దీన్, అబ్దుల్‌హకీమ్ పాల్గొన్నారు.