అవసరమైన మరమ్మతులు చేయించండి
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:06 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరిసరాల శుభ్రతతో పాటు అవసరమైన మరమ్మతులు చే యించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికా రులను ఆదేశించారు.
- కలెక్టర్ ఆదర్శ్ సురభి
- ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ
వనపర్తి వైద్యవిభాగం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రిలో పరిసరాల శుభ్రతతో పాటు అవసరమైన మరమ్మతులు చే యించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికా రులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని అకస్మికంగా తనిఖీ చేశారు. అవసరమైన చోట సీసీ రోడ్డు వే యించాలని, మురుగు కాల్వను మరమ్మతు చే యించాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని వా హనాల పార్కింగ్ కోసం ఉపయోగించాలని సూచించారు. డాక్టర్లు, ప్రొఫెసర్లు హెడ్ క్వార్టర్స్ లో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిం చాలని తెలిపారు.30 ఏళ్లు పైబడినవారందరికీ బీపీ, షుగర్ పరీక్షలు చేయాలన్నారు. అనం తరం సూపరింటెండెంట్ చాంబర్‌లో వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్య క్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికా ర్జున్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగా రావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.