జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - May 27 , 2025 | 11:24 PM
ప్రభుత్వం రాయితీపై అందించే జీలుగ విత్తనాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసా య అధికారి సక్రియా నాయక్ అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్
మల్దకల్, మే 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రాయితీపై అందించే జీలుగ విత్తనాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసా య అధికారి సక్రియా నాయక్ అన్నారు. మం డల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మంగళవారం రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం మా ట్లాడిన సక్రియా నాయక్, జీలుగ విత్తనాలను పంట పొలంలో వేసుకుని 45 రోజుల తర్వాల కలియ దున్నడం వల్ల పంట దిగుబడి పెరగ డంతో పాటు భూమి సారవంతంగా మారు తుందన్నారు. పీఏసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి మా ట్లాడుతూ ఈనెల 28 నుంచి ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం కార్యాలయంలో 30 కేజీల జీలుగ విత్తనాలను రాయితీపై పంపిణీ చేస్తామని తెలిపారు. మండలానికి 133 బస్తా లు కేటాయించారని, ఒక రైతులకు 30 కేజీల బస్తా ఇస్తామని, బస్తా ధర రూ.2,137లుగా నిర్ణయించారని చెప్పారు. విత్తనాలు కావాల్సిన రైతు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జికాక్స్ కా పీలను తీసుకుని మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ రైతులకు సూచించారు. కార్యక్రమం లో పీఏసీఎస్ వైస్ చైర్మన్ విష్ణు, వ్యవసాయ విస్తరణ, పీఏసీఎస్ అధికారులు ఉన్నారు.