కృష్ణ రైల్వేస్టేషన్‌కు మహర్దశ
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:10 PM
నారాయణపేట జిల్లా కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. పలు అభివృద్ధి పనుల కోసం స్టేషన్‌కు రూ.16 కోట్లు మంజూరు అ య్యాయి. 1908లో బ్రిటీషర్లు కృష్ణ రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. మీటర్ గేజ్ రైల్వేలైన్ నిర్మించారు.
అభివృద్ధి పనులకు రూ.16 కోట్లు మంజూరు
రెండు ఫ్లాట్‌ఫారాలు, అధునాతన ప్రాంగణాలు, లిఫ్ట్, ఎక్సలేటర్ నిర్మాణం
కృష్ణ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. పలు అభివృద్ధి పనుల కోసం స్టేషన్‌కు రూ.16 కోట్లు మంజూరు అ య్యాయి. 1908లో బ్రిటీషర్లు కృష్ణ రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. మీటర్ గేజ్ రైల్వేలైన్ నిర్మించారు. రైల్వే స్టేషన్ పూర్తి అభివృద్ధికి నోచుకోక, రైళ్లు ఆగక ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే రెండేళ్లలో కృష్ణా పుష్కరాలు రానున్నాయి. దేవరకద్ర-కృష్ణ రైల్వేలైన్ ఇప్పటికే ప్రారంభం కాగా, వికారాబాద్-కృష్ణ లైన్ నిర్మాణ పనులు మంజూరు అయ్యా యి. దాంతో కృష్ణ జంక్షన్‌గా మారనుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రయాణికులు పెరగడం, పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి పనులను చేప ట్టనున్నారు. రెండు ప్లాట్ ఫారాలు, వెయిటింగ్ హాల్, ఎక్స్‌లేటర్, లిఫ్ట్, అధునాతన ప్రాంగణాలు, కార్, బైక్ పార్కింగ్ తదితర నిర్మాణాల కోసం రూ.16 కోట్లు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. స్టేషన్‌కు అన్ని హంగులు సమకూరనున్నాయని, అన్ని రైళ్లు నిలపడం వల్ల జిల్లా ప్రజలకు మరిన్ని సేవలు అందనున్నాయని చెప్పారు.
స్టేషన్‌ను పరిశీలించిన డివిజనల్ మేనేజర్
కృష్ణ రైల్వే స్టేషన్‌ను గుంతకల్లు డివిజన్ మేనేజర్ చంద్ర, ఎస్ గుప్తా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా 2027లో వచ్చే కృష్ణ పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. ప్రయాణికుల కోసం ఎక్సలేటర్, లిఫ్ట్, భవనాలు, రెండు ఫ్లాట్‌ఫారాలు, రైల్వే సిబ్బందికి భవనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైళ్లకు అవసరమైన వాటరింగ్ ట్యాంక్, ప్రయాణికులకు తాగునీటి ట్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట అధికారులు, ఇంజనీర్లు ఉన్నారు.