169 పరుగులతో మహబూబ్‌నగర్ గెలుపు
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:39 PM
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అండర్-19 ఉమ్మడి జిల్లా వన్‌డే క్రికెట్‌లో మహబూబ్‌నగర్ జట్టు వనపర్తిపై 169 పరుగులు తేడాతో విజయం సాధించింది.
- బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన మనోజ్‌యాదవ్
- అర్ధ సెంచరీతో రాణించిన యువన్
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అండర్-19 ఉమ్మడి జిల్లా వన్‌డే క్రికెట్‌లో మహబూబ్‌నగర్ జట్టు వనపర్తిపై 169 పరుగులు తేడాతో విజయం సాధించింది. జిల్లా కేంద్రంలోని సమర్థ పాఠశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ - వనపర్తి జట్లు తలబడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 50 ఓవర్లలో 282 రన్‌లకు ఆలౌట్ అయ్యింది. జట్టులో యువన్ 93 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్ధసెంచరీ (70) చేశారు. మనోజ్‌యాదవ్ 41 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధసెంచరీ (52) సాఽఽధించారు. కాన్షిక్ 34, అబినవ్ 20 పరుగులు చేశారు. వనపర్తి బౌలర్లలో చరణ్ 4, పరమేశ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వనపర్తి జట్టు 28.2 ఓవర్లలో 113 పరుగులకు కూప్పకూలింది. జట్టులో మహేశ్‌నాయక్ 28, పర్హద్ 26 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లలో మనోజ్‌యాదవ్ 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎం. రాహుల్, అకింత్‌రాయ్ చోరో రెండు వికెట్లు తీశారు.
క్రీడాకారులు ప్రతిభ చాటాలి
వన్ డే టోర్నీలో క్రీడాకారులు ప్రతిభ చాటాలని జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. మహబూబ్‌నగర్ - వనపర్తి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 2డే లీగ్‌లో క్రీడాకారులు ప్రతిభ చాటి అండర్-23 ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యారని తెలిపారు. వన్‌డే టోర్నీలో రాణిస్తే ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికవుతారని తెలిపారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారుడు రంజిత్ పాల్గొన్నారు.