Share News

అండర్‌-19 టోర్నీలో మహబూబ్‌నగర్‌ జోరు

ABN , Publish Date - Jun 05 , 2025 | 11:36 PM

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అండర్‌-19 ఉమ్మడి జిల్లా వన్‌డే క్రికెట్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు జోరు కొన సాగుతున్నది.

అండర్‌-19 టోర్నీలో మహబూబ్‌నగర్‌ జోరు
గెలిచిన మహబూబ్‌నగర్‌ జట్టుతో ఎండీసీఏ సెక్రటరీ రాజశేఖర్‌

-254 పరుగుల తేడాతో నారాయణపేటపై ఘన విజయం

- సెంచరీతో చెలరేగిన అబ్దుల్‌ రాఫె

- 5 వికెట్లు తీసి రాణించిన కిశోర్‌

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అండర్‌-19 ఉమ్మడి జిల్లా వన్‌డే క్రికెట్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు జోరు కొన సాగుతున్నది. నారాయణపేటపై 254 పరుగు ల తేడాతో గెలిచింది. జిల్లా కేంద్రంలోని సమ ర్థ పాఠశాల మైదానంలో బుధవారం నిర్వ హించిన నాల్గవ మ్యాచ్‌లో మహబూబ్‌నగ ర్‌-నారాయణపేట జట్లు తలబడ్డాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌ నగర్‌ జట్టు 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. జట్టులో అబ్దుల్‌ రాఫె 127 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ(165) చేశాడు. ప్రణవ్‌ 58 బంతుల్లో 6 ఫోర్లతో అర్ధసెంచరీ(56), రామ్‌చర్రి 31 ప రుగులు చేశారు. నారాయణపేట బౌలర్లలో డీజే అకిల్‌ 3, రామ్‌చరణ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నారాయణపే ట జట్టు 31.1 ఓవర్లలో 89 పరుగులకు అలౌ ట్‌ అయ్యింది. జట్టులో లోకేష్‌ 17, డీజే అకి ల్‌ 10 చేశారు. మహబూబ్‌నగర్‌ బౌలర్లలో కి శోర్‌ 5, మనోజ్‌యాదవ్‌, అభినవ్‌ రెండు వికె ట్లు తీశారు. మహబూబ్‌నగర్‌ జట్టును జిల్లా క్రికెట్‌ సంఘం ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ అభినందించారు. టోర్నీలో ఆయా జట్ల క్రీడాకారులు ప్రతిభ చాటాలన్నారు. గ్రామీణ క్రీడాకారులు టోర్నీలో రాణించాల న్నారు. సెంచరీ సాధించిన అబ్దుల్‌రాఫె, 5 వికెట్లు తీసిన కిశోర్‌ను అభినందించారు. కోచ్‌ అబ్దుల్లా, సీనియర్‌ క్రీడాకారుడు మన్నాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 11:36 PM