Share News

కాకా స్మారక టీ-20లో చాంపియన్‌ మహబూబ్‌నగర్‌

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:20 PM

జి. వెంకటస్వామి కాకా మెమోరియల్‌ టీ-20 ఉమ్మడి జిల్లా క్రికెట్‌ లీగ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది.

కాకా స్మారక టీ-20లో  చాంపియన్‌ మహబూబ్‌నగర్‌
చాంపియన్‌ మహబూబ్‌నగర్‌ జట్టుకు ట్రోఫీ అందిస్తున్న ఎండీసీఏ చీఫ్‌ ప్యాట్రన్‌ మనోహర్‌రెడ్డి, సెక్రటరీ రాజశేఖర్‌

- రన్నర్‌గా నాగర్‌కర్నూల్‌ జట్టు

మహబూబ్‌నగర్‌స్పోర్ట్ప్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి) : జి. వెంకటస్వామి కాకా మెమోరియల్‌ టీ-20 ఉమ్మడి జిల్లా క్రికెట్‌ లీగ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. నాగర్‌కర్నూల్‌ జట్టు రెండవ స్థానాన్ని దక్కించుకున్నది. శుక్రవారం ఎండీసీఏ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌ మహబూబ్‌నగర్‌ - నారాయణపేట జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన నారాయణపేట జట్టు 20 ఓవర్లలలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్‌ జట్టు 12.4 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 126 పరుగులు చేసి విజయం సాధించింది. 67 పరుగులు చేసిన డేవిడ్‌ క్రిపాల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు. మరో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన నాగర్‌కర్నూల్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నారాయణపేట జట్టు 19.4 ఓవర్లలో 97 పరుగులకు కూప్పకూలింది. బ్యాటింగ్‌లో 33 పరుగులు, బౌలింగ్‌ 3 వికెట్లు తీసి రాణించిన నాగర్‌కర్నూల్‌ బ్యాట్స్‌మెన్‌ జశ్వంత్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు. టోర్నీలో 2.622 రన్‌రేట్‌, 6 పాయింట్లతో మహబూబ్‌నగర్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. నాగర్‌కర్నూల్‌ జట్టు రెండో స్థానాన్ని దక్కించుకున్నది. విజేతలకు ఎండీసీఏ చీఫ్‌ ప్యాట్రన్‌ మనోహర్‌రెడ్డి ట్రోఫీలు అందజేశారు. అంతకు ముందు నాగర్‌కర్నూల్‌ బ్యాట్స్‌మెన్‌ జశ్వంత్‌కు ఉమ్మడి జిల్లా ఒలంపిక్‌ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందించారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, ఉపాధ్యాక్షులు సురేష్‌కుమార్‌, అశోక్‌, సభ్యులు రాజేందర్‌రెడ్డి, లక్ష్మకాంత్‌రావు, గోపాలకృష్ణ, శివశంకర్‌, అబ్దుల్లా, మన్నన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక

జి.వెంకటస్వామి కాకా మెమోరియల్‌ టీ-20 అంతర్‌ జిల్లాల క్రికెట్‌ లీగ్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలుర జట్టు జిల్లా క్రికెట్‌ సంఘం సెక్రటరీ రాజశేఖర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి హైదరాబాద్‌లో లీగ్‌ నిర్వహించనున్నారు. టోర్నీలో పాల్గొననున్న జట్టులో డేవిడ్‌క్రిపాల్‌, ఎ.శ్రీకాంత్‌, అబ్దుల్‌రాఫె, ముఖిద్‌, షాదాబ్‌, అచ్యుత్‌రామ్‌, ఆర్యన్‌, ఎన్‌. జశ్వంత్‌, అరవింద్‌, జి. జశ్వంత్‌, అక్షయ్‌, వెంకటచంద్ర, గగన్‌, అభిలాష్‌, కె. శ్రీకాంత్‌లు స్థానం సంపాదించుకున్నారు.

Updated Date - Dec 26 , 2025 | 11:20 PM