రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:35 PM
ప్రభుత్వం మహిళా స్వయం స హాయక సంఘాలకు ఇస్తున్న రుణాలను సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఫలితం గా మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థి కంగా ఎదిగేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాల పంపిణీ
గద్వాల న్యూటౌన్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మహిళా స్వయం స హాయక సంఘాలకు ఇస్తున్న రుణాలను సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఫలితం గా మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థి కంగా ఎదిగేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఐడీవోసీ సమావేశపు హాలులో సెర్ప్ ఆధ్వర్యం లో ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల సభ్యులకు శక్తి స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ బీఎం సంతోష్‌తో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల్లో ఉన్న ప్రతీ ఒక్క సభ్యురాలికి గుర్తిం పు, గౌరవం ఉండాలని ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రుణాలతో వ్యాపారాలు చేసుకుంటూ, వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేస్తూ కుటుంబ అవసరాలకు వినియోగిస్తుండటంతో కుటుంబ నిర్వహణలో మహిళలు కీలకశక్తిగా ఎదుగుతున్నారన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ సంకల్పమని, అందులో భా గంగానే అనేక సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేశామన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ గత శనివారం గోనుపాడులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సందర్బంగా పలువురు మహిళా సంఘాల సభ్యులు వడ్డీలేని రుణాలు కావాలని కోరారన్నారు. ప్రభు త్వ నిర్ణయంతో త్వరలోనే సాకారం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాకు మొత్తం 4724 సంఘాలకు రూ. 510 కోట్ల వడ్డీలేని రుణాలు రావడం జరిగిందన్నారు. మహిళా స్వయం సహాయక సం ఘాల్లో లేని మహిళలను కూడా సంఘాల్లో చేర్పించి ప్రతి ఆడపడుచు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. మహిళలు పెట్రోల్ బంక్‌లు, సోలార్ పవర్ ప్లాంట్ నిర్వహణతో కూడా సంపాదించే అవకాశాన్ని కల్గించడం జరిగిందన్నారు. సమావేశంలో డీఆర్డీఏ ఏపీ డీ శ్రీనివాసరులు, డీపీఎంలు సలోమి, అరుణ, అయా మండలాల మహిళా సంఘాల అధ్యక్షు లు, సభ్యులు ఉన్నారు.