Share News

అర్హులందరికీ సకాలంలో రుణాలు అందించాలి

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:15 PM

అర్హులందరికీ సకాలంలో రుణా లు మంజూరు చేయాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి బ్యాంకర్లను ఆదేశించారు.

అర్హులందరికీ సకాలంలో రుణాలు అందించాలి

- నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి

గద్వాల న్యూటౌన్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సకాలంలో రుణా లు మంజూరు చేయాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి బ్యాంకర్లను ఆదేశించారు. సోమ వారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హా ల్‌లో జూన్‌-2025 మాసాంతపు జిల్లాస్థాయి బ్యాంకర్ల సమన్వయ సమావేశం నిర్వహించా రు. ఎంపీ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ము ఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగు లకు రుణమేళా కార్యక్రమంలో జిల్లాకు రూ.2వే ల కోట్ల రుణ లక్ష్యం కేటాయించారని గుర్తుచేశా రు. ఇందులో బ్యాంకర్లు ఇప్పటివరకు ఎంత మందికి రుణాలు మంజూరు చేశారని ఎంపీ బ్యాంకర్‌లను అడుగగా, వారు స్పందిస్తూ ఇప్ప టి వరకు రూ.250కోట్లను అందజేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎంతమందికి రుణాలు అందించారు, ఎన్ని గ్రౌండింగ్‌ చేశారు, ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్న పూర్తి వివరాలను అందజేయాలని సూచించారు. జిల్లాలో ఎంపీ నిధులతో గురుకుల పాఠశాల లు, పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు రూ.1.54 కోట్లు మంజూరు చేశామన్నారు. కలెక్ట ర్‌ సంతోష్‌ మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకులు పంట, అనుబంధ రుణాలు, ఉపాధి యూనిట్లస్థాపన, చిన్న,మధ్య తరహా, విద్య, గృహ రుణాలతో పాటు ఇతర ప్రాధాన్యత రుణాలను అర్హులకు మంజూరు చే యాలన్నారు. పీఎం విశ్వకర్మ యోజన కింద లబ్ధిదారులకు యూనిట్లను మంజూరు చేయాల న్నారు. సమావేశంలో ఎల్‌డీఎం శ్రీనివాస్‌రావు, ఆర్‌బీఐ ఏజీఎం చేతన్‌ గవర్కర్‌, నాబార్డ్‌ డీడీ ఎం మనోహర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 11:15 PM