మాదక ద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నం
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:34 PM
మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకోకుండా వాటికి దూరంగా ఉండాలని కమ్యూనిటీ ఎడ్యుకేటర్ కృష్ణయ్య అ న్నారు.
గద్వాల అర్బన్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకోకుండా వాటికి దూరంగా ఉండాలని కమ్యూనిటీ ఎడ్యుకేటర్ కృష్ణయ్య అ న్నారు. అదే సమయంలో జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చే ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మా దకద్రవ్యా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భా గంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేష న్‌లో మహిళా శిశు, వికాలాంగుల వయోవృద్ధు ల శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియో గం, అక్రమ రవాణా నిర్మూలనకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణ య్య మాట్లాడుతూ గద్వాల జిల్లా మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమన్నా రు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు, పొ గాకు, గంజాయి, హెరాయిన్, కొకైన్, ఆల్మోజో మ్ వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్ద న్నారు. వీటి వినియోగం వల్ల ఉజ్వల భవిష్య త్ చిన్నాభిన్నం కావడంతో పాటు సమాజంలో అభాసుపాలు అవుతారన్నారు. అలాగే మత్తుప దార్థాల వినియోగం, అక్రమ రవాణాకు దూరం గా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యా ర్థులు, యువత చెడుఅలవాట్లకు బానిసలు కావద్దని, అలాంటి వారికి డీ అడిక్షన్ సెంటర్‌లో కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నా రు. మత్తుపదార్థాల నిర్మూలన ప్రతీఒక్కరి బా ధ్యత అని, ఎవరైనా మత్తు పదార్థాలు వాడితే 100, 14446, 1908 నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రైల్వే ఎస్‌ఐ, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ జయన్న, కేస్ వర్కర్ లక్ష్మీ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.