పెద్దపులుల ప్రత్యక్షం
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:52 PM
నల్లమ ల అభయారణ్య ప్రాంతం లో మూడు రోజులుగా పె ద్దపులులు సందడి చేస్తు న్నారు.
- సఫారీ టూర్‌లో తరచూ తారస
- పెద్దపులుల సంచారాన్ని చూస్తూ ఆనందిస్తున్న పర్యాటకులు
మన్ననూర్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): నల్లమ ల అభయారణ్య ప్రాంతం లో మూడు రోజులుగా పె ద్దపులులు సందడి చేస్తు న్నారు. పర్హాబాద్ వ్యూపా యింట్‌కు వెళ్లే దారిలో, గుండం సఫారీ రిజర్వు ఫారెస్టులో పెద్దపులుల సంచారం అధికమైంది. ప ర్హాబాద్ చౌరస్తా నుంచి స ఫారీ వాహనాల్లో వెళ్లే పర్యటకులకు రెండు రోజుల్లో మూడు పర్యాయాలు పె ద్దపులులు సంచరిస్తూ కనిపించాయి. ఇట్టి దృశ్యాలను తమ వెంట తెచ్చుకున్న చరవాణీలు, కెమెరాల్లో చిత్రీకరణ చేసుకొని ఆనందంతో పర్యాటకులు పరవ శించి పోతున్నారు. అక్టోబరు 1 నుంచి టైగర్ సఫారీ పునఃప్రారంభమైంది. ప ర్యాటకులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లలో సఫారీ పర్యటనకు వస్తున్నారు. గతంలో ఆరు సార్లు పెద్దపులులు నిజాంబంగ్లా(షికారీగర్), గుండం రహదారిలో సంచరిస్తూ కనిపించి సందడి చేశాయి. తాజాగా మంగళవారం సాయంత్రం అటవీ సిబ్బందికి పుల్లాయపల్లి బీట్‌లో ఓ పెద్దపులి కనిపించినట్లు డీఎఫ్‌వో రోహిత్ గోపిడి అటవీశాఖకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి ధ్రువీకరించారు. పెద్దపులులు సంచరిస్తూ కనిపించడంతో టైగర్ సఫారీ ఆఫ్‌లైన్ రేట్లను 3వేల ప్యాకేజీని 5వేలకు, 2వేల ప్యాకేజీని 3వేలకు అమాంతంగా పెంచేశారు.