Share News

ఇళ్ల లబ్ధిదారుల జాబితా త్వరగా ఇవ్వాలి

ABN , Publish Date - May 24 , 2025 | 11:25 PM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేసి పరిశీలించిన జాబితాను వెంటనే సమర్పించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ చెప్పారు.

ఇళ్ల లబ్ధిదారుల జాబితా త్వరగా ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

- జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

గద్వాల న్యూటౌన్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేసి పరిశీలించిన జాబితాను వెంటనే సమర్పించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ చెప్పారు. శనివారం ఐడీవోసీ కాన్ఫరెన్స్‌హాలులో ఇంది రమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువవికాసం పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలాలు, మునిసిపాలిటీల వారీగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. అర్హుల వివరాల జాబితాను వెంటనే అందజేయాలని సూచించారు. పైలట్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ ప్రక్రియ ను వేగవంతంగా పూర్తిచేసి, సంబంధిత ఏఈ లు క్షేత్రస్ధాయిలో పనుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. ఏఈలు గ్రామ కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారుల నిర్మాణ పనులను ప్రారంభించుకునే విధంగా ప్రోత్సహించాలని ఆదేశించారు. రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనను జాప్యం చేయకుండా వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాజీవ్‌ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్య త క్రమంలో ఎంపిక జరగాలన్నారు. లబ్ధిదారుల వివరాల సాఫ్ట్‌ కాపీని బ్యాంకులకు వెంటనే పంపించాలని, అలాగే సెక్టార్‌ వారీగా నాన్‌ లిం కేజ్‌ బ్యాంకింగ్‌ వివరాలతో జాబితా సిద్ధం చే యాలని ఎంపీడీవోలకు సూచించారు. సోమవా రంలోపు లబ్ధిదారులు బ్యాంకు వివరాల నిర్ధారణను పూర్తిచేసి తుదిజాబితాను జిల్లా కార్యాలయానికి సమర్పించాలన్నారు. అధికారులు,బ్యాం కర్లు పరస్పర సమన్వయంతో పనిచేసి, నిర్ధేశించిన లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాల ని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీ రమేశ్‌బాబు, ఎల్డీఎం శ్రీనివాసరావు, హౌ సింగ్‌ పీడీ శ్రీనివాసులు, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు ఉన్నారు.

Updated Date - May 24 , 2025 | 11:25 PM