నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేద్దాం
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:09 PM
ని యోజకవర్గంలో విద్యాభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేద్దామని అలంపూర్ ఎ మ్మెల్యే విజయుడు పిలుపునిచ్చారు.
- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
అయిజ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ని యోజకవర్గంలో విద్యాభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేద్దామని అలంపూర్ ఎ మ్మెల్యే విజయుడు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలో నూతనంగా మంజూ రైన ప్రాథమిక పాఠశాలలను మార్కెట్ చె ౖర్మన్ దొడ్డప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనుతో కలిసి ప్రారంభించారు. పిల్లల ను బడికి పంపించకపోతే తల్లిదండ్రులు చట్టరీత్యా నేరస్తులు అవుతారని వివరించా రు. పట్టణంలోని టీచర్స్ కాలనీ, ఎస్సీ కాలనీ, బుడగజంగాల కాలనీలో కొత్త పాఠశాలలను ప్రారంభించారు. తెలుగుపేట, తెలంగాణ చౌర స్తా ప్రాంతాలలో ఏర్పాటు కావాల్సిన పాఠశాలలకు గదులు లేని కారణంగా వాయిదా వేసి నట్లు తెలిపారు. కాగా తనను ఆహ్వానించకపోవటం అవమానకరమని సింగిల్‌విండో అధ్య క్షుడు పోతుల మధుసూధన్‌రెడ్డి విలేకరుల స మావేశంలో తెలిపారు. విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
కరపత్రాలు విడుదల
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు సంబంధిచిన కరపత్రాలను ఎమ్మెల్యే ఎక్లాస్‌పూర్ గ్రామంలో విడుదల చేశారు. త్రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో ఈ నెల 16వ నుంచి 19వ తేదీ వరకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.