డ్రగ్స్‌రహిత జిల్లా కోసం కృషి చేద్దాం
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:26 PM
జోగుళాంబ గద్వాలను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చి దిద్దేందుకు పౌరులంతా బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ పిలుపునిచ్చారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పిలుపు
నియంత్రణలో యువత భాగస్వాములు కావాలి : ఎస్పీ
గద్వాల టౌన్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాలను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చి దిద్దేందుకు పౌరులంతా బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవా ణా, అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సంద ర్భంగా గురువారం పట్టణంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కృష్ణవేణి చౌరస్తా వద్ద ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ పచ్చజెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పాతబస్టాండ్ స ర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా ట్లాడిన కలెక్టర్, పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాలు, మదకద్రవ్యాల నిరోధక కమిటీలను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలన్నారు.ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాల ని ర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావా లన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి సునంద, డీఎంహెచ్‌వో సిద్ధప్ప, డీఎస్పీ మొగిలయ్య, ఎక్జైజ్, పోలీస్, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.