కార్పొరేషన్ గెలిచి సీఎంకు కానుక ఇద్దాం
ABN , Publish Date - Jul 25 , 2025 | 10:50 PM
మహబూబ్‌నగర్ నగరంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ప్రేమ ఉన్నదని, ప్రభుత్వం అధికారంలోకి రాగానే మునిసిపాలిటీగా ఉన్న పాలమూరును కార్పొరేషన్ చేసి రాష్ట్రంలో ఉన్న 13 కార్పొరేషన్‌ల సరసన నిలబెట్టారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
60 స్థానాలలో విజయం సాధించాలి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి
కాంగ్రె్‌సలో చేరిన మాజీ కౌన్సిలర్లు
మహబూబ్‌నగర్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ నగరంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ప్రేమ ఉన్నదని, ప్రభుత్వం అధికారంలోకి రాగానే మునిసిపాలిటీగా ఉన్న పాలమూరును కార్పొరేషన్ చేసి రాష్ట్రంలో ఉన్న 13 కార్పొరేషన్‌ల సరసన నిలబెట్టారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు అడిగినా ఇస్తున్నారని, అందుకే 60 డివిజన్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామని నగర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎ్‌సను వీడిన మాజీ కౌన్సిలర్‌లు గోపాల్‌యాదవ్, ఆయన సతీమణి పద్మజ, మరో మాజీకౌన్సిలర్ రామకృష్ణ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. అదేవిధంగా బీజేపీ నుంచి పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతీ డివిజన్‌లో కాంగ్రెస్ తరఫున నిలబడే అభ్యర్థిలో రేవంత్‌రెడ్డిని చూడాలన్నారు. ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ వచ్చిన తరువాత కార్పొరేషన్ పరిధిలో రూ.200 కోట్ల అభివృద్ధి పనులు చేసుకున్నామని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి ఎంతో ప్రయత్నిస్తున్నారన్నారు. బీసీలకు బీఆర్‌ఎ్‌సలో కనీస గౌరవం ఉండేది కాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, నాయకులు మల్లు నర్సింహారెడ్డి, లక్ష్మణ్‌యాదవ్, ఆనంద్ కుమార్‌గౌడ్, ఎన్‌పీ వెంకటేశ్, బెక్కరి అనిత, మారెపల్లి సురేందర్‌రెడ్డి, వసంత, అమరేందర్‌రాజు, రాఘవేందర్‌రాజు, సిరాజ్‌ఖాద్రి, జహీర్‌అక్తర్, సత్తూర్ చంద్రకుమార్‌గౌడ్, సీజే బెనహర్ పాల్గొన్నారు.