ఐలమ్మ ఆశయ సాధనకు అడుగులు వేద్దాం
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:09 PM
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం అడుగులు వేద్దామని మహబూబ్‌నగర్ ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
పాలమూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం అడుగులు వేద్దామని మహబూబ్‌నగర్ ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐల మ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్ట్ ఏరియాలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అ ర్పించారు. అనంతరం మాట్లాడు తూ ఐలమ్మ జీవితం ఎంతో మం దికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమం చేశారని గుర్తు చేశారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్వి సిరాజ్‌ఖాద్రి, అంజయ్యగౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర పాల్గొన్నారు.