మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:31 PM
ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జోగుళాంబ సర్కిల్ చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ రాంబాబు, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఎంఎస్‌ఎన్ ప్రసాద్‌రెడ్డి, ఫా రెస్ట్ రేంజ్ అధికారి కమాలొద్దీన్, మునిసిపల్ ఇంజనీర్ మహేష్ అన్నారు.
- జోగుళాంబ సర్కిల్ చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ రాంబాబు
- ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
నారాయణపేట/మక్తల్‌రూరల్/ మక్తల్/కొత్తపల్లి/మరికల్/ ఊట్కూర్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జోగుళాంబ సర్కిల్ చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ రాంబాబు, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఎంఎస్‌ఎన్ ప్రసాద్‌రెడ్డి, ఫా రెస్ట్ రేంజ్ అధికారి కమాలొద్దీన్, మునిసిపల్ ఇంజనీర్ మహేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వందరోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా గురువారం పేట మునిసిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ర్యాలీని అంబేడ్కర్ చౌరస్తా లో జోగుళాంబ సర్కిల్ చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ రాంబాబు ప్రారంభించారు. అశోక్‌నగర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అశోక్‌నగర్‌లో విస్తృతంగా మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు రెండు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల న్నారు. కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది మహేష్, శ్రీనివాస్, అజీమ్, భరత్, చెన్నకేశవులు, శ్రీధర్ తదితరులున్నారు.
అదేవిధంగా, మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో పర్యావరణ పరిరక్షణపై గ్రామస్థులకు ఎంపీడీవో రమేశ్ అవగాహన కల్పించారు. పర్యావరణ హితానికి ప్రతీ ఒక్కరు పాటుపడాలని అందులో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. ప్రతీ దుకాణానికి, ఇంటికి తిరుగుతూ మొక్కలు పెంచాలని, ప్లా స్టిక్ వాడకాన్ని నిషేధించాలని సూచించారు. కా ర్యక్రమంలో పరిషత్ కార్యాలయ సిబ్బంది, మా జీ సర్పంచులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
మక్తల్ మునిసిపాలిటీ పరిధిలోని దండు గ్రా మంలో జనసేన మక్తల్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ మణికంఠగౌడ్ మొక్కలు నాటారు. మొక్కలు నాటి పెంచడం వల్ల దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండుతాయన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నా రు. కార్యక్రమంలో బాల్‌రెడ్డి, వెంకటేష్, రవి తదితరులున్నారు.
కొత్తపల్లి మండలంలోని నిడ్జింత, కొత్తపల్లి గ్రామాల్లో గురువారం ప్రపంచ పర్యావరణ దినో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిడ్జింత చౌరస్తాలో అధికారులు, రైతులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీవో రామన్న మాట్లాడారు. అంతకుముందు గ్రామంలోని పలు వీధుల గుండా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంక టేశ్, గ్రామస్థులు పాల్గొన్నారు.
మరికల్ పట్టణంలోని ఇందిరాగాంఽధీ చౌరస్తాలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్ సుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్ర పంచ పర్యావరణ దినోత్స వాన్ని నిర్వహించారు. కార్య క్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ అఽధికారి తైలేష్ హాజరై, మాట్లాడారు. ఎంపీడీవో కొండన్న, గ్రామ యువకులు ఆశా వర్కర్లు, మహిళా సంఘం సభ్యులు, యువకులు, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.
ఊట్కూర్‌లో అధికారులు ర్యాలీ నిర్వహించారు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఎంపీవో లక్ష్మినరసింహరాజు, ఏపీవో లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే 23 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.