నియోజకవర్గాన్ని హరితమయం చేద్దాం
ABN , Publish Date - May 21 , 2025 | 11:00 PM
మక్తల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మునిసిపాలిటీలను హరితమయం చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహ రి అన్నారు.

మక్తల్, మే 21 (ఆంధ్రజ్యోతి): మక్తల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మునిసిపాలిటీలను హరితమయం చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహ రి అన్నారు. బుధవారం పట్టణం లోని ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి హరిత హారం కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ నియోజకవర్గంలోని మునిసిపాలిటీలు, మండలాల్లో హరితహారం మొక్కలు పెంచి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉం దన్నారు. ఇందుకోసం అవసరమైతే గ్రీనరీ సేన లు ప్రారంభించేందుకు సిద్ధమేనన్నారు. నియో జకవర్గంలో పచ్చదనం పెంచేందుకు అహర్ని శలు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఎంపీ డీవో రమేష్, మునిసిపల్ కమిషనర్ శంకర్ నాయక్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, వివిధ మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, ఫా రెస్టు ఆఫీసర్లు పాల్గొన్నారు.